ఆస్తులు అమ్మే కుట్ర.. ఆర్టీసీ విలీనంపై ఈటల రాజేందర్ ఆరోపణ

Update: 2023-08-04 11:46 GMT

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిందని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులు క్రమంగా ప్రైవేటుపరం చేస్తున్నారని, ఒకప్పుడు 56 వేలుగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సంఖ్య ఇప్పుడు 43 వేలకు తగ్గిందని అన్నారు. బస్సుల సంఖ్య 12 వేల నుంచి 3 వేలకు తగ్గించారని ఈటల అన్నారు.

ఆర్టీసీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తాత్కాలిక కార్మికుల పరిస్థితేంటో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. 6 నెలలకు ఒకసారి సభ జరగాల్సి ఉన్నందున మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నా కేవలం 3 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు పరిమితం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో చేయని రైతుల రుణమాఫీ ఈ రెండు నెలల్లో చేస్తుందా? అని ఈటల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. బాధితులకు తక్షణ సాయంగా రూ.25 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా.. సీఎం నుంచి కనీస స్పందన లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంటపొలాలు మునిగిపోతున్నాయని ఈటల ఆరోపించారు. 3 నెలల్లో ఈ ప్రభుత్వం ఉండదని జోస్యం చెప్పారు.

bjp mla etala rajender slams cm kcr over rtc

telangana,assembly session,monsoon session,bjp mla etala rajender,cm kcr,tsrtc,rtc employees,farmer loan waiver,kaleshwaram project,flood water

Tags:    

Similar News