హుజూరాబాద్లో బీఆర్ఎస్ ఒక సైకోను ఎమ్మెల్సీ చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కౌశిక్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. కౌశిక్ వ్యవహారంపై సీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు ఈటల తెలిపారు. ‘‘ఆ సైకో మా కార్యకర్తలనే కొట్టి కేసులు పెడ్డుతున్నాడు. ఈ సైకోను వెంటనే పదవి నుంచి తొలగించాలి. మా ఓపిక నశించిన రోజు సైకోకు చెప్పుల దండ వేసి తిప్పుతాం. నన్ను చంపేందుకు సుపారి ఇచ్చేంత వరకు పరిస్థితి వచ్చింది. ఈ సైకో వల్ల బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారు” అని ఈటల అన్నారు.
కేసీఆర్ సపోర్ట్తోనే ఈ సైకో వేధింపులకు దిగుతున్నాడని ఈటల అన్నారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని.. సాంబశివుడిని హత్య చేసినప్పుడు తన డ్రైవర్‌ను కిడ్నాప్ చేసినా బెదరలేదని గుర్తుచేశారు. అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎంది, ప్రభుత్వానిదని ఈటల స్పష్టం చేశారు. తన భద్రతను పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గం ప్రజలు చూసుకుంటారని తెలిపారు.
ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా
అంతకుముందు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఈటల భద్రతపై డీజీపీ అంజనీకుమార్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు. ముప్పు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని సూచించారు.
కాగా బుధవారం ఈటల జమున సంచలన వ్యాఖ్యల చేశారు. ఈటలను చంపేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్‌రెడ్డి అన్నాడని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్‌రెడ్డి చెలరేగిపోతున్నాడని విమర్శించారు. తమ కుటుంబానికి ఏమైన జరిగితే కేసీఆర్దే బాధ్యత అని అన్నారు. . అటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తామని చెప్పడం.. ప్రజలపై వారికున్న ప్రేమ ఎటువంటిదో అర్ధమవుతోందన్నారు