కేసీఆర్ గురించి పూర్తిగా తెలుసు.. గెలుపు మాదే : ఈటల

Update: 2023-07-04 11:45 GMT

బీజేపీ అధిష్ఠానం తనను ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్గా నియమించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. కీలక బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ నాయకత్వం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. తెలంగాణ రాజకీయాలు, కేసీఆర్ గురించి తనకు అవగాహన ఉందని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఒక కార్యకర్తలా పనిచేసి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని స్పష్టం చేశారు. కాగా తెలంగాణలో పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే బండి సంజయ్ను తప్పించి.. కిషన్ రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడిగా నియమించింది. ఈటలకు ఎన్నికల కమిటీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది.


Tags:    

Similar News