అసెంబ్లీ సెషన్ 30 రోజుల పాటు నడపాలి - రఘునందన్ రావు

Update: 2023-07-31 12:52 GMT

అసెంబ్లీ సమావేశాలను ఈసారి 30 రోజుల పాటు నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశఆరు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా 30 రోజుల పాటు అసెంబ్లీ సెషన్ నిర్వహించలేదని గుర్తు చేశారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నగదుకైనా అసెంబ్లీని కనీసం 30 రోజులు నిర్వహించాలని అన్నారు.

వరదలతో నష్టపోయిన ప్రజలు, రైతుల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం అప్పులపై సభలో ప్రజేంటేషన్ ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యేలు తప్ప అందరూ మిత్రపక్షాలేనని రఘునందన్.. బీఆర్ఎస్కు ఇవే చివరి సమావేశాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకుల మందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. రైతు రుణమాఫీపై సచివాలయం ఎదుట, అసెంబ్లీ, ఆర్థిక మంత్రి ఇంటి ముందు ధర్నాచేయాలని సూచించారు.

హైదరాబాద్ చుట్టూ ఎన్ని ఎకరాల భూములు అమ్మారు ఆ సొమ్మును ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేస్తారో సభలో చెప్పాలని రఘునందన్ అన్నారు. మైనారిటీ బంధు అందరికీ ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం బీసీలందరికీ బీసీ బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి కింద ఇస్తానన్న రూ. 3లక్షలతో ఇల్లు ఎలా కట్టుకుంటారని రఘునందన్ ప్రశ్నించారు.


Tags:    

Similar News