కిషన్రెడ్డికి అధ్యక్ష పదవి.. స్పందించిన రఘునందన్ రావు

Update: 2023-07-04 15:25 GMT

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. అధ్యక్షుడిగా ఎంపికైన కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్కు శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందని చెప్పారు.

కాగా తెలంగాణ బీజేపీలో అధిష్టానం భారీ మార్పులు చేపట్టింది. బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి.. కిషన్ రెడ్డికి అప్పగించింది. అదేవిధంగా కొన్నాళ్లుగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఈటల రాజేందర్ కు ఎన్నికల కమిటీ చైర్మన్ గా నియమించింది. అయితే రఘునందన్ రావుకు మాత్రం ఎటువంటి పదవి ఇవ్వలేదు. పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధికార ప్రతినిధి, శాసనసభ పక్షనేత పదవుల్లో ఏదైన ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వార్తొలచ్చాయి. అయితే ఆ వార్తలను ఖండించిన.. పార్టీ పదవులు కోరుకోవడంలో తప్పులేదని అనడం గమనార్హం.

Tags:    

Similar News