Telangana BJP: ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉంది - ఈటల రాజేందర్

By :  Kiran
Update: 2023-10-15 13:10 GMT

సీఎం కేసీఆర్ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్న బీజేపీ జనగర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 30న జరిగే ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఇంచార్జులు పనిచేస్తున్న విషయాన్ని ఈటల గుర్తు చేశారు.

రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నారని ఈటల అన్నారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షాలు దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ఇందులో భాగంగానే జిల్లా, మండల, బూత్ కమిటీ, శక్తి కమిటీలతో పాటు మోర్చా కమిటీల ద్వారా గ్రామ గ్రామాన ప్రచారం చేపడుతున్నామని స్పష్టం చేశారు. సోమవారం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే సభకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వస్తున్నారని, ఈ సభకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఈటల పిలుపునిచ్చారు.

Tags:    

Similar News