రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 12మందితో రెండో జాబితాను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభ బరిలో నిలవనున్నారు. జేపీ నడ్డాతో పాటు గోవింద్‌భాయ్ డోలాకియా, మయాంక్‌భాయ్ నాయక్, శ్వంత్‌సిన్హ్ జలంసింహ గుజరాత్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్, మేధా కుల్‌కర్ణీ, అజిత్ గోప్‌చాడే పేర్లను ప్రకటించింది. మధ్యప్రదేశ్ నుంచి డా. ఎల్. మురుగన్, ఉమేష్‌నాథ్ మహారాజ్, బన్సిలాల్ గుర్జార్, మాయా నరోలియాలను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఓడిశా నుంచి అశ్విని వైష్ణవ్‌కు మరోసారి అవకాశం కల్పించింది.