సకల జనుల సౌభాగ్య తెలంగాణ.. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన అమిత్ షా..

Update: 2023-11-18 14:22 GMT

తెలంగాణ బీజేపీ ఎట్టకేలకూ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సకల జనుల సౌభాగ్య తెలంగాణ.. మన మోడీ గ్యారెంటీ.. బీజేపీ భరోసా పేరుతో రూపొందించిన ఎన్నికల ప్రణాళికను కేంద్ర మంత్రి అమిత్ షా విడుదల చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేసింది.

బీఆర్ఎస్ పార్టీ పదేండ్ల అవినీతిపై కమిటీ వేస్తామని ప్రకటించింది. ధరణి పోర్టల్ ను రద్దు చేసి స్థానంలో మీభూమి యాప్ తీసుకొస్తామని హామీ ఇచ్చింది. బీజేపీపాలిత రాష్ట్రాల్లోలాగే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది.

మేనిఫెస్టోలోని మరికొన్ని అంశాలు

ఓఆర్ఆర్ బిడ్డింగ్పై దర్యాప్తు

పేదలకు ఇండ్ల పట్టాలు

రైతులకు ఏటా రూ.18వేలు

మతపరమైన రిజర్వేషన్లు తొలగింపు

జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ కోటా పెంపు

ఎస్సీ వర్గీకరణను వేగవంతం

ఆడబిడ్డ పుడితే రూ. 2లక్షల ఫిక్స్డ్ డిపాజిట్

జాతీయ పండుగగా సమ్మక్క సారక్క జాతర

యూపీఎస్సీ తరహాలో 6 నెలలకోసారి నియామకాలు

నిజామాబాద్లో టర్మరిక్ సిటీ

ఉచితంగా పంట బీమా

వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీయాత్ర

డిగ్రీ విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్ టాప్

ఉజ్వల లబ్దిదారులకు ఏడాదికి 4 సిలిండర్లు ఫ్రీ

జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ కోటా పెంపు

అర్హత ఉన్న కుటుంబాలకు రూ.10లక్షల బీమా




Tags:    

Similar News