ఆ ఇళ్లను చూసేందుకు వెళ్తే ప్రభుత్వానికి భయమెందుకు : కిషన్ రెడ్డి

By :  Kiran
Update: 2023-07-20 05:29 GMT

తెలంగాణ బీజేపీ తలపెట్టిన ‘ఛలో బాట సింగారం’ ఉద్రిక్తతకు దారి తీసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్, డీకే అరుణ సహా పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను చూడడానికి వెళ్తే ప్రభుత్వానికి అంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు.

ఇదేమైనా ఉద్యమమా.. లేక తిరుగుబాటా చేస్తున్నామా అని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్రమ అరెస్టులు బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టగా మారాయన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్లు గొప్పగా నిర్మిస్తే ఈ అక్రమ అరెస్టులెందుకు అని ప్రశ్నించారు. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైందని.. బీఆర్ఎస్ను గద్దెదించే వరకు ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

తెలంగాణ సర్కార్ 6 లక్షల 10 వేల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని కేంద్రానికి నివేదిక ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం 2 లక్షల 83 వేల డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం 17 వేల కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో మంజూరు చేసిందన్నారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం ఇళ్లను ఎందుకు చేపట్టలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

Tags:    

Similar News