Breaking News: బీఆర్ఎస్కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా.. !
బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఆయనకు బోథ్ టికెట్ ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అతిత్వరలోనే ఆయన ఆయన హస్తం కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
ఈ సారి బోథ్ బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాపూరావుకు కాకుండా అనిల్ జాదవ్‌కి కేటాయించారు గులాబీ బాస్. అప్పటినుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలో రేవంత్ ను కలవడంతో ఆయన కాంగ్రెస్లో చేరడం ఖాయంగా కన్పిస్తోంది. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన బాపూరావు 2014, 2018 బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలిపొందారు. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సైతం కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఇప్పటికే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.