దమ్ముంటే నాపై పోటీ చెయ్.. ఓవైసీకి ఎమ్మెల్యే షకీల్ సవాల్

Update: 2023-06-30 06:15 GMT

నిజామాబాద్ జిల్లా బోధన్లో పాలిటిక్స్ బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎంగా మారాయి. ఎంఐఎం కౌన్సిలర్ల అరెస్టే దీనికి కారణమయ్యింది. జైలులో అరెస్టైన కౌన్సిలర్లు కలిసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఓవైసీ కామెంట్స్కు షకీల్ కౌంటర్ ఇచ్చారు. అసదుద్దీన్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓవైసీ బెదిరిస్తే భయపడే వారు ఎవరూ లేరంటూ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటూ తనపై పోటీ చేయాలని ఓవైసీకి సవాల్ విసిరారు.

ఎన్నికలు వస్తున్న తరుణంలో ఓవైసీ నిజస్వరూపం బయటపడుతోందన్నారు. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడే వారు ఎవరూ లేరని చెప్పారు. దమ్ముంటే ముందు నుండి కొట్లాడాలని.. వెనుక నుంచి కాదని హితవు పలికారు. ‘‘నేనెవరి మీదా తప్పుడు కేసులు పెట్టలేదు. ఎంఐఎం కౌనిల్సర్లు నామీద హత్యాయత్నం చేశారు. ప్లాన్ ప్రకారమే ఆరోజు నామీద దాడి చేసి చంపాలనుకున్నారు’’అని షకీల్ ఆరోపించారు.

ప్రస్తుతం జైలులో ఉన్న నిందితులపై సంఘ విద్రోహా కేసులు ఉన్నాయని షకీల్ అన్నారు. దొంగతనం, రౌడీయిజం, మర్డర్‌ ఇలా చాలా కేసులు వారిపై ఉన్నట్లు చెప్పారు. బోధన్‌ బీఆర్‌ఎస్‌ రాజకీయ నేత శరత్‌ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యాయత్నం కేసులో పోలీసులే నిజానిజాలు తేలుస్తారన్నారు.

Tags:    

Similar News