Alpha Hotel : సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు
By : Mic Tv Desk
Update: 2024-01-28 03:13 GMT
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఆల్పా హొటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఓ ఆగంతుడు ఫోన్ చేసి ఆల్ప హోటల్‌లో బాంబు పెట్టమని చెప్పాడు. వెంటనే ప్రమత్తమైన పోలీసులు హొటల్‌ని మూసేశారు. ఘటన స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ ఆల్పలో తనీఖీలు చేయగా ఎలాంటి బాంబు లభించలేదని పోలీసులు తేల్చారు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. రాత్రి 10 గంటల 45 నిముషాలకు మాకు ఫోన్ కాల్ వచ్చిందని. వెంటనే స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో బాంబు పెట్టిన దాఖలాలు కనిపించలేదని డీసీపీ సుబ్బారాయుడు తెలిపారు. దీంతో అది ఫేక్ కాల్‌గా నిర్ధారణ అయిందన్నారు. కాల్ వచ్చింది ఖమ్మం నుంచి అని తేలింది. కానీ ఎవరు చేశారో ఇంకా తెలియాల్సి ఉంది. వీలైనంత త్వరగా అతణ్ని పట్టుకుంటాం’ అని డీసీపీ తెలిపారు.