మందుబాబులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. బోనాల సందర్భంగా ఆది, సోమవారాల్లో వైన్ షాపులు బంద్ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. బోనాల పండుగ కారణంగా సౌత్ జోన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలో ఈ నెల 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం వరకు వైన్స్ బంద్ చేయాలని స్పష్టం చేశారు.