ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావుకు పెనుప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నిర్మల్ బైపాస్ సమీపంలో ఆవును ఢీ కొట్టగా ఎమ్మెల్యే కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. వాహనంలో ముందు కూర్చున్న ఎమ్మెల్యే చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి అధిక రక్తస్రావం కావడంతో మరో వాహనంలో ఎమ్మెల్యే బాపూరావును బోథ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.