Lok Sabha elections : కేసీఆర్తో భేటీ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. పొత్తు ఖరారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బంజారాహిల్స్ లోని నందినగర్ లో గల కేసీఆర్ నివాసంలో వీరు భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు పెట్టుకుంటాయని వార్తులు వినిపించగా.. అదే నిజమని తేలింది. బీఎస్పీ,బీఆర్ఎస్ పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. తర్వరలో ఈ మేరకు విధివిదానాలను ఇరు పార్టీలు ప్రకటింస్తాయి.
ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయనుండగా.. దీనికి బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుందని తెలుస్తోంది. ఇవాళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ కుమార్ మద్దతిచ్చేందుకు ఆయన అంగీకరించినట్లు సమాయారం. అయితే పలువురు పార్టీ నేతలు మాత్రం.. వీరి భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని చెప్పారు. రాజకీయాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. కాగా వీరి భేటీకి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.