లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి, నల్గొండ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే భువనగిరి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు. అయితే ఇవాళ ఉదమయే సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్ సభ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరును ప్రకటించారు. అయితే ఇప్పటికి హైదరాబాద్ మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇంకా హైదరాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయనున్నారో వెల్లడించాల్సి ఉంది.