BRS Election Campaign: నేడు సిరిసిల్ల, సిద్దిపేటకు కేసీఆర్‌

Update: 2023-10-17 02:39 GMT

బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు సిరిసిల్ల , సిద్ధిపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం తన సెంటిమెంట్ నియోజకవర్గమైన హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన మంగళవారం సిరిసిల్ల, సిద్ధిపేట పట్టణాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలోపాల్గొనున్నారు. మొదట సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మొదటి బైపాస్ రోడ్డులో కే కన్వెన్షన్ ఎదురుగా 25 ఎకరాల స్థలంలో నిర్వహించబోయే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. లక్ష మంది హాజరుకానున్న ఈ సభకు సిరిసిల్ల నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

బిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫేస్టో ప్రకటించిన తరువాత సిఎం కెసిఆర్ సిరిసిల్లలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ రాష్ట్రంలో మూడో వది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం తలపెట్టిన సిఎం కెసిఆర్ సభ రెండవది కానుంది. మంత్రి కెటిఆర్ ఆదివారం సిఎం కెసిఆర్ చేతుల మీదుగా భీ ఫామ్ తీసుకోగా ఐదోవసారి సిరిసిల్ల అసెంబ్లీ నియోజవర్గ బరిలో నిలువనున్నారు. సిఎం కెసిఆర్ సిరిసిల్ల పర్యటనతో నియోజవర్గ పార్టీశ్రేణుల్లో జోష్ నింపనున్నారు.

సిరిసిల్ల తర్వాత సిద్దిపేట శివారులోని నాగదేవత గుడి బైపాస్‌లో సిరిసిల్ల వెళ్లే రోడ్డులో మంగళవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించనున్నారు. సోమవారం ఈ సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. లక్ష మందితో జరిగే సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సుమారు 20 వేల మంది బైక్‌ ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకోనున్నది. ప్రాంగణం చుట్టూ సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు కటౌట్లు పెట్టారు. సభకు వచ్చే జనానికి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ రాక కోసం హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రసంగం కోసం అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News