రేపట్నుంచి మళ్లీ ప్రజా ఆశీర్వాద సభలు.. కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఇదే..

By :  Kiran
Update: 2023-11-12 15:51 GMT

సీఎం కేసీఆర్ మూడో విడత ప్రచారం సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్ నవంబర్ 9న నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత దీపావళి పండుగ నేపథ్యంలో ప్రచారానికి మూడు రోజులు సెలవు ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత సోమవారం నుంచి మరోసారి సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 13 నుంచి 28 వరకు కేసీఆర్ 54 సభల్లో పాల్గొంటారు. నవంబర్ 25న హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఇదే

నవంబర్ 13 - దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్‌

నవంబర్ 14 - పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం

నవంబర్ 15 - బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి, మెదక్‌

నవంబర్ 16 - ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌

నవంబర్ 17 - కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, పరకాల

నవంబర్ 18 - జనగాంలో రోడ్ షో

నవంబర్ 19 - అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి

నవంబర్ 20 - మానకొండూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ

నవంబర్ 21 - మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట

నవంబర్ 22 - తాండూర్‌, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగి

నవంబర్ 23 - మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు

నవంబర్ 24 - మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి

నవంబర్ 25 - హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ

నవంబర్ 26 - ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక

నవంబర్ 27 - షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డి

నవంబర్ 28 - వరంగల్‌ (ఈస్ట్‌, వెస్ట్‌), గజ్వేల్‌

Tags:    

Similar News