60 ఏండ్లలో వందల మంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ ఇప్పుడు తియ్యటి మాటలు మాట్లాడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. అవి విని ఆగమైదామా అని ప్రశ్నించారు.
తెలంగాణను చావగొట్టి, తాగు, సాగునీరు, కరెంట్ ఇవ్వకుండా రైతులను వేధించిన కాంగ్రెస్ పార్టీతోనే మన పోరాటం అని తేల్చి చెప్పారు. వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రెండు ఆలోచన విధానాలు, సిద్ధాంతాలు, సంస్థల మధ్యే పోటీ జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ఇలా మానేరు వాగు వెంట ఉన్న ప్రతి ఊరు ఉర్రుతలూగించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని అన్నారు. దొరల తెలంగాణ కావాల్నా..? ప్రజల తెలంగాణ కావాల్నా..? అని రాహుల్ గాంధీ అడుగుతున్నాడని, వాస్తవానికి ఇది ఢిల్లీ దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మధ్య జరిగే ఎన్నిక అని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ సమాజం తప్పకుండా బుద్ది చెప్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.