ప్రభుత్వ షాకింగ్ నిర్ణయం.. రేవంత్ రెడ్డి సెక్యూరిటీ తొలగింపు

Update: 2023-08-17 17:03 GMT

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సెక్యూరిటీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో బుధవారం (ఆగస్ట్ 16) నుంచి రేవంత్ సెక్యూరిటీ లేకుండానే జనాల్లో తిరుగుతున్నారు. ఇటీవలే 4+4 సెక్యూరిటీని 2+2కు కుదించిన ప్రభుత్వం తాజాగా పూర్తి సెక్యూరిటీని తొలగించింది. దీంతో ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. 2 నెలల క్రితమే తనకు సెక్యూరిటీ కల్పించాలని రేవంత్ రెడ్డి కోర్ట్ లో పిటిషన్ వేయగా.. కోర్ట్ నుంచి ఎలాంటి తీర్పు రాకముందే.. ఎలాంటి కారణాలు లేకుండా సెక్యూరిటీని తొలగించడంపై గందగోళం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు.

దీనిపై గాంధీభవన్ లో నిర్వహించిన సమావేశంలో మహబూబ్ నగర్ పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్.. రెడ్ డైరీలో పోలీసుల పేర్లు రాస్తానని, 100 రోజుల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి గుడ్డలిప్పదీస్తానని, అసలు మిత్తి కలిపి చెల్లిస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా భద్రతా సిబ్బంది విధులకు హాజరు కాలేదని అనుకోగా.. ప్రభుత్వమే వాళ్లను తొలిగించినట్లు తర్వాత తెలిసింది.




Tags:    

Similar News