బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం

Update: 2023-06-15 12:18 GMT

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఎన్‌హెచ్‌ - 44పై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జోగు రామన్నకు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ నగేష్తో కలిసి.. పార్టీ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు నాగపూర్ వెళ్తున్నారు.

ఈ క్రమంలో మహారాష్ట్రలోని పాండ్ర కవడ వద్ద ఎన్‌హెచ్‌-44పై ఎద్దులను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రామన్నకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం వారు మరొక వాహనంలో​ నాగపూర్‌ వెళ్లారు. ఈ ప్రమాదంపై జోగురామన్న స్పందించారు. నాగ్పూర్లో జరిగే సీఎం కేసీఆర్ సమావేశానికి వెళ్తుండగా రోడ్డుపై వాహనానికి ఆకస్మికంగా పశువులు అడ్డం రావడంతో చిన్న ప్రమాదం జరిగింది. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పారు.

కాగా నాగపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు పార్టీ జెండా ఆవిష్కరించి.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కేసీఆర్ వెంట కేకే, తోట చంద్రశేఖర్, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, బాల్క సుమన్ సహా పలువురు ఉన్నారు.

Tags:    

Similar News