ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమివ్వలేదు - హరీశ్ రావు

Byline :  Kiran
Update: 2023-12-16 13:29 GMT

అసెంబ్లీలో అధికార పక్షం వైఖరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తప్పుబట్టారు. ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, ఎంఐఎం పార్టీలకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్తూ గోబెల్స్ ప్రచారం చేసిందని హరీశ్ ఆరోపించారు. డెమొక్రాటిక్గా ఉంటామన్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావు చనిపోతే కనీసం వెళ్లచూడని పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. అమరులకు ప్రతిసారి నివాళులు అర్పించిన తర్వాతే కేసీఆర్ పనులు మొదలు పెడుతారని గుర్తు చేశారు. తమపై ఎన్నో ఉద్యమ కేసులున్నా సీఎం రేవంత్ మాత్రం లేవని అబద్దాలు చెబుతున్నారని హరీశ్ ఆరోపించారు.

Tags:    

Similar News