డీకే శివకుమార్‌ను కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి..త్వరలో హస్తం గూటికి!
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. ఆయన వెంట కుమారుడు భద్రారెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు మల్లారెడ్డి గత రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తొంది.ఈ నేేపథ్యంలో డీకేని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.మల్లారెడ్డి కుంటుంబ సభ్యులు ప్రియాంక గాంధీ అపాయిమెంట్ తీసుకున్నట్లు సమచారం. డీకేతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాయబారం నడుపుతున్నట్లు తెలిసింది. కర్నాటక స్టేట్ కే చెందిన తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ద్వారా డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం ఉంది.
అయితే డీకే శివకుమార్ ఒక వేళ పార్టీ పెద్దలను ఒప్పించగలిగితే ఈ నెలలో కాంగ్రెస్‌లో చేరాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రి వర్గంలోని ఓ కీలక మంత్రిని ఈ నెల 4వ తేదీన మల్లారెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిలు రహస్యంగా కలిసినట్లు టాక్. తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని మల్లారెడ్డి సదరు మంత్రిని అభ్యర్థించినట్లు తెలిసింది. తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌తో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే మంత్రి మాత్రం మీ రాకను పార్టీ పెద్దలు ఒప్పుకోక పోవచ్చని, కానీ తన వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చినట్లు తెలిసింది. సీఎంను ఎలాగైనా ఒప్పించాలని, లేకపోతే ఢల్లీి స్థాయిలో తన కోసం ప్రయత్నాలు చేయాలని మల్లారెడ్డి కోరినట్లు తెలిసింది.