Women Reservation bill: మోదీకి కవిత థ్యాంక్స్... ఇంటి దగ్గర బాణసంచాతో వేడుక
మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం రాత్రి బిల్లును ఆమోదించాక ఆమె హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. నృత్యం చేస్తున్నాను. అయితే నాకు కొంత ఆందోళనగానూ ఉంది. గతంలో బిల్లును నీరుగార్చిన ఉందంతాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ నరేంద్ర మోదీజీకి కృతజ్ఞతలు. బిల్లు ఆమోదం గురించి ఇంకా అధికారికంగా తెలియడం లేదు...’’ అని ఆమె అన్నారు. బిల్లు ఆమోదంతో ఆమె తన ఇంటి ముందు బాణసంచా కాల్పించి వేడుకలు చేసుకున్నారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు ౩౩% శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. మోదీ ప్రభుత్వానికి మాత్రమే ఈ దమ్ము ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ ట్వీట్ చేశారు.
With the ruling party holding a clear majority in the…— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 18, 2023మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. మోడీకి ధన్యవాదాలు తెలిపారు. pic.twitter.com/tbSbKSDZh8
— Telugu Scribe (@TeluguScribe) September 18, 2023