మహిళలపై దాడులు ఆపండి...బీజేపీపై కవిత ఫైర్!

Update: 2023-08-24 08:11 GMT

తెలంగాణ బీజేపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. ఇకనైనా మహిళలపై దాడి చేయడం ఆపాలని ట్విటర్ వేదికగా కవిత బీజేపీ నేతలకు హితవుపలికారు. తప్పుడు వ్యాఖ్యలతో మహిళలను అవహేళన చేయడం మానుకోవాలని ఆమె సూచించారు. మహిళలను వ్యక్తిత్వహరణం చేయడం బీజేపీకి అలవాటైపోయిందని మండిపడ్డారు. ట్విట్టర్లో తెలంగాణ బీజేపీ చేసిన ఓ ట్వీట్‌పై తాజాగా కవిత ఘాటుగా రిప్లై ఇచ్చారు.

" కాలంచెల్లిన మూస పద్ధతులను ఉపయోగించి మహిళలను అవహేళన చేస్తూ సమయం వృధా చేయకండి. మహిళల ఎదుగుదలను బీజేపీ ఓర్వలేకపోతుందా? మహిళా హక్కుల గురించి మాట్లాడుతున్న వారి గొంతు నొక్కేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నవ్వువస్తోంది. ఇప్పటికైనా ఇతరులపై నిందలు వేయడం మానుకోవాలి. పార్లమెంటులో మహిళా బిల్లును ఆమోదించేందుకు అవసరమైన కృషి చేయాలి" అని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.





Tags:    

Similar News