MLC Kavitha: తెలంగాణ ద్రోహులకు - తెలంగాణ ప్రేమికులకు మధ్య యుద్ధం : కవిత

By :  Krishna
Update: 2023-10-19 06:43 GMT

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా ఆరోపిస్తారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ ఖర్చు లక్ష కోట్లలోపేనని చెప్పారు. కమీషన్ తీసుకుంటే చెరువులు కళకళలాడేవా అని నిలదీశారు. రాహుల్ మాటలు వింటుంటే నవ్వొస్తుందని సెటైర్ వేశారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తే రైతు బంధు ఎలా వస్తుందని అడిగారు. రాహుల్ అసత్యాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24గంటల కరెంట్ ఉండదని ఆరోపించారు.

ప్రస్తుతం తెలంగాణ ద్రోహులకు - తెలంగాణ ప్రేమికులకు మధ్య యుద్ధం జరుగుతోందని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 2004లోనే తెలంగాణ ఇస్తే ఇంకా అభివృద్ధి జరిగేదన్నారు. కాంగ్రెస్ వల్లే 1969లో 369మందిని కోల్పోయామని.. మలిదశ ఉద్యమంలోనూ ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజమని.. కాంగ్రెస్కు ఓటేస్తే కర్ణాటక గతే పడుతుందన్నారు. ప్రజలు అభివృద్ధి చేసే పార్టీకి అండగా నిలవాలని కోరారు.

Tags:    

Similar News