MLC KAVITHA: అతితక్కువ సమయంలో అత్యంత వేగంగా అభివృద్ధి : కవిత

By :  Krishna
Update: 2023-10-31 07:00 GMT

ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ‘‘ఎక్స్‌ప్లోరింగ్‌ ఇన్‌క్లూసివ్‌ డెవలప్‌మెంట్‌ - ది తెలంగాణ మాడల్‌’’ అనే అంశంపై కవిత ప్రసంగించారు. కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం కేసీఆర్ అభినవ చాణక్య అన్న కవిత.. దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచిగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని.. అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులని కవిత స్పష్టం చేశారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని.. సీఎం ఆధ్వర్యంలో తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ అని.. బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.

తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని కవిత గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని 9జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడి ఉండేవని.. విద్యుత్ కొరత, నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని చెప్పారు. కరెంట్ లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూసివేసేవారని అన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక సరికొత్త సంస్కరణలతో ఆ పరిస్థితులను మార్చేశారని చెప్పారు.

Tags:    

Similar News