MLC Kavitha : సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత..జాగృతి కమిటీలు రద్దు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి అన్ని కమీటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోగా పలువురు నాయకులు పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమీటీల్లో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తే ఆ ఎఫెక్ట్ కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీపై అవకాశం ఉన్నందున ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. భారత జాగృతి సంస్థకు చెందిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు నేడు ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు కవిత కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కమిటీల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే భారత జాగృతి నేతలు సైతం కాంగ్రెస్, ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం రావడంతో కవిత ముందే అప్రమత్తమై కమిటీల అన్ని రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కమిటీల్లో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తే.. ఆ ఎఫెక్ట్ తనతో పాటు బీఆర్ఎస్ పార్టీపై పడుతోందని అలర్ట్ అయ్యే కవిత కమిటీలన్నీ రద్దు చేసి.. విధేయులతో త్వరలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, కవిత సడెన్‌గా భారత జాగృతి కమిటీలు అన్ని రద్దు చేయడానికి గల అసలు కారణాలు ఏంటన్నది మాత్రం తెలియాల్సి ఉంది.