మార్చి 6న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నా

Byline :  Bharath
Update: 2024-03-04 14:36 GMT

బీఆర్ఎస్ హయాంలో ఎల్ఆర్ఎస్ పై అడ్డగోలుగా మాట్లాడిన కాంగ్రెస్ లీడర్లు.. తమ అధికారం రాగానే మాట మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇంబందులు పడుతున్నారని ఆవేన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. మార్చి 6న రాష్ట్ర వ్యప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేటీఆర్.. రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చిందన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని మీడియా ముఖంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ కు 25.44 లక్షల దరఖాస్తులు వచ్చాయని, తము ప్రభుత్వం నామినల్ ఫీజు పెట్టినట్లు గుర్తుచేశారు. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు. నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అని మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉచితంగా భూములను క్రమబద్దీకరిస్తామని చెప్పారు. ఆ మాటలన్నీ ఇప్పుడేమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.20 వేల కోట్ల భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మోపిందన్నారు. దీనివల్ల ఒక్కో కుటుంబంపై రూ.లక్ష భారం పడుతుందని చెప్పారు. 

Tags:    

Similar News