మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యం.. జనవరి 27 నుంచి బీఆర్ఎస్ సమావేశాలు

By :  Bharath
Update: 2024-01-25 15:24 GMT

లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈ మేరకు జనవరి 27 నుంచి రాష్ట్రం వ్యప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా.. పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ సమావేశాలు ముగిస్తామని అన్నారు. నియోజకవర్గల్లోని సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. లోక్ సభ ఎలక్షన్స్ కు సంబంధించి నియోజకవర్గాల వారీగా నేతలు, కార్యకర్తలతో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశాల బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీలు చూసుకోవాలని ఆదేశించారు.

బీఆర్ఎస్ షెడ్యూల్:

➤ ఈనెల 27న సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాలు.

➤ 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాలు.

➤ 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గాలు.




Tags:    

Similar News