TS Budget Session : తొలి రోజు బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ దూరం..!

Byline :  Kiran
Update: 2024-02-08 05:57 GMT

తెలంగాణ మూడో శాసనసభ తొలి బడ్జెట్‌ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. ఉదయం 11.30కి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు. అయితే గవర్నర్ ప్రసంగానికి మాజీ సీఎం, ప్రతిపక్షనేత కేసీఆర్ డుమ్మా కొట్టనున్నారు. తొలిరోజు సమావేశాలకు ఆయన హాజరుకావడం లేదని పార్టీ వర్గాలు చెప్పారు. రేపటి నుంచి కేసీఆర్ సభకు రానుండగా.. మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఇవాళ్టి నుంచి సభకు హాజరుకానున్నారు.

శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలపనుంది. ఈ నెల 10న రేవంత్ రెడ్డి సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల అనంతరం కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అందులో రాష్ట్రానికి కేటాయించే నిధుల ఆధారంగా మళ్లీ పూర్తి స్థాయి డ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 12 అంశాలపై 6 రోజుల పాటు చర్చ జరగనుంది. గురువారం స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ.. బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్న అంశంతో పాటు, ఎజెండా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News