Revanth Reddy : రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది - రేవంత్ రెడ్డి

Byline :  Kiran
Update: 2023-10-02 10:37 GMT

రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చినా ఆ పార్టీని ప్రజలు నమ్మరని అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో చిట్ చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ హవా ఆపడం ఎవరితరం కాదని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ సెంట్రల్‌ ఎలక్షన్ కమిటీ భేటీ అనంతరం పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. టికెట్లు ప్రకటించే సమయానికి చాలా మంది బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి వస్తున్నారంటే తమ బలమేంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో 25 సీట్లు దాటే అవకాశంలేదని రేవంత్ జోస్యం చెప్పారు.

రాష్ట్రంలో 19 శాతం ఓట్లు ప్రస్తుతం అన్‌ డిసైడెడ్‌ మోడ్‌లో ఉన్నాయని రేవంత్ అన్నారు. ఇందులో మెజారిటీ ఓటు షేర్ తమకే వస్తుందని అభిప్రయపడ్డారు. సౌత్, నార్త్ ఓట్ పల్స్‌కు చాలా తేడా ఉంటుందన్న ఆయన.. కాంగ్రెస్‌లో బీసీ ఆశావాహుల తరఫున కొట్లాడుతానని రేవంత్‌ స్పష్టం చేశారు.




Tags:    

Similar News