KTR: పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలి.. కేటీఆర్

Byline :  Veerendra Prasad
Update: 2024-01-16 05:25 GMT

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్పందించారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. గత పదేండ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం కలిగిన పవర్ లూమ్ నేతన్నలు, అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారన్నారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయన్నారు. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.                               




Tags:    

Similar News