పందెం గిత్తలకు ఊహించని ధర..తెలుగు రాష్ట్రాల్లో సంచలనం

Update: 2023-08-10 09:55 GMT

తెలుగు రాష్ట్రాలకు ఎడ్ల పందేలకు ప్రత్యేక స్థానం ఉంది. అనాటి నుంచి ప్రాచుర్యం ఉన్న ఎడ్ల పందేలకు ఇటీవల కాలంలో మరింత డిమాండ్ పెరిగింది. జాతరలు, సంక్రాంతి సంబరాలు, ఉత్సవాలు వంటి కార్యక్రమాల్లో పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని తిలకించేందుకు జనాలు కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు.

ఎక్కువగా ఒంగోలు గిత్తలను పోటీల్లో ఉపయోగిస్తారు. వాటికి చిన్నప్పటినుంచే మంచి ఆహారం అందించి పోటీల కోసం తీర్చిదిద్దుతారు. దీంతో ఒంగోలు గిత్తలకు భారీ క్రేజ్ వచ్చింది. విక్రయానికి పెడితే కళ్లు తిరిగే రేంజ్‌లో ధర పలుకుతోంది. పోటీలో పాల్గొని పలుమార్లు విజయం సాధించిన గిత్తల గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వాటిని కొనేందుకు ఎంత డబ్బైనా ఖర్చుచేస్తున్నారు పలువురు పందెం రాయుళ్లు. తాజాగా ఓ జత గిత్తలు అధిక ధరకు అమ్ముడయ్యాయి.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‎కు చెందిన హైదరాబాద్ ఏసీపీ సుంకి సురేంద్ రెడ్డి తాను పెంచుకున్న గిత్తల్లో ఒక జతను రూ.కోటీ 10 లక్షలకు అమ్మారు. వీటిని ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతారం గ్రామానికి చెందిన రైతు సబ్జా సతీష్ కొనుగోలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోనే గిత్తల అమ్మకాలు, కొనుగోళ్లలో ఇది రికార్డు స్థాయి ధర అని ఎసిపి సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ గిత్తలకు ఇంత ధర పలకడం వెనుక కారణం కూడా ఉంది. భీముడు, అర్జునుడుగా పిలిచే ఈ రెండు కోడెలు...తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 9 నెలల్లో జరిగిన 40కి పైగా పోటీల్లో పాల్గొని 34 సార్లు ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి.

Tags:    

Similar News