Bus Lo Bharosa : సిరిసిల్లలో బస్సులో భరోసా ప్రాజెక్టు ప్రారంభించిన కేటీఆర్

Update: 2023-08-15 12:42 GMT

మహిళల రక్షణ కోసం సిరిసిల్ల పోలీసులు చేపట్టిన బస్సులో భరోసా కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆర్టీసీతో పాటు స్కూల్ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్ ను అరికట్టే ప్రయత్నంలో భాగంగా సిరిసిల్ల పోలీసులు చేపట్టిన ఈ ప్రాజెక్టును కేటీఆర్ ప్రశంసించారు.

మహిళలు సురక్షితంగా, పూర్తి రక్షణతో ప్రయాణించేందుకు బస్సులో భరోసా ప్రాజెక్టులో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం అభినందనీయమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించాక కేసీఆర్ సర్కారు మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. శాంతి భద్రతల నిర్వహణలో తెలంగాణ పోలీస్ శాఖ అద్భుతంగా పని చేస్తోందని,ఈ రోజున సీసీటీవీల ద్వారా నేర నియంత్రలో దేశం మొత్తంలో నంబర్ వన్ గా తెలంగాణ పోలీస్ నిలుస్తోందని పేర్కొన్నారు.




 


బస్సులో భరోసా కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో మొత్తం 130 బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు 77 బస్సుల్లో సీసీ కెమెరాలు అమర్చగా మిగిలిన బస్సుల్లోనూ 10 నుండి 15 రోజులలో ఆ పని పూర్తవుతుందని పోలీసులు చెప్పారు. బస్సుల్లోని సీసీ కెమెరాలన్నింటినీ డిపోతో పాటు పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు.




Tags:    

Similar News