BRS MLA Car Accident : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం..
Byline : Krishna
Update: 2024-02-13 15:03 GMT
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు ప్రమాదం జరిగింది. ఇవాళ నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆమె హాజరయ్యారు. సభ ముగిసిన తర్వాత ఆమె హైదరాబాద్ తిరిగొస్తుండగా ఎమ్మెల్యే కారును మరో కారు ఢీకొట్టింది. నార్కట్ పల్లి దాటిన తర్వాత చెర్లపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఎమ్మెల్యేతో పాటు ఆమె సోదరి నివేదిత, గన్‌మెన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో కారులో ఆమె హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.