Padi Kaushik Reddy : పోలీసులపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు...కేసు నమోదు
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు కరీంనగర్ లో ఆయన పై కేసు నమోదు అయింది. ఈ నెల 7న కరీంనగర్ లో బీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తుందని అప్పుడు పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ బెదిరించారు. అంతేగాక కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవర్నీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అయితే పోలీసులపై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పట్టణానికి చెందిన ఆశిష్ గౌడ్ అనే వ్యక్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కౌశిక్ రెడ్డి పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడరని..తక్షణమే అతనిపై చర్యలు తీసుకొవాలని ఫిర్యాదులో తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.