Railway Line : హైదరాబాద్‌-విజయవాడకు డబుల్‌ రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నిల్

Update: 2024-02-09 05:23 GMT

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే తక్కువ సమయంలో భాగ్యనగరం నుంచి విజయవాడకు డబుల్ లైన్‌గా విస్తరించున్నారు. దూరం తక్కువగా ఉండేలా హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక, ప్రత్యామ్నాయ రైల్వే మార్గం తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తెలంగాణలో కీలకంగా ఉన్న మోటుమర్రి – విష్ణుపురం సింగిల్‌ రైల్వే లైన్‌ (88.81 కి.మీ.)ను డబుల్‌ లైన్‌గా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాన మోదీ అధ్యక్షతన దిల్లీలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఈ పనుల అంచనా వ్యయం రూ.1,746.20 కోట్లుగా నిర్ణయించింది.

ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌-విజయవాడకు మరో ప్రత్యామ్నాయ మార్గంతోపాటు దగ్గరి దారి అవుతుందని కేంద్రం తెలిపింది. ఈ డబ్లింగ్‌ ప్రాజెక్టులో మోటుమర్రి వద్ద 10.87 కి.మీ. మేర రైల్‌ ఓవర్‌ రైల్‌ ప్రాజెక్టు రానుంది. కింద ఒక రైలు వెళుతుంటే దానిపై వంతెన నుంచి మరొకటి వెళుతుంది. దీంతో రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర మొత్తం నాలుగు లైన్ల రైల్వే డివిజన్ కాబోతోందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించబోతున్నామని డీఆర్ఎం తెలిపారు. ఒక్కో స్టేషన్ ఆధునికీకరణ కోసం దాదాపు 25 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. విశాఖ నుంచి విజయవాడ వైపు ఒకేసారి రెండు రైళ్లు వెళ్తాయి. విజయవాడ నుంచి విశాఖకు ఒకేసారి రెండు రైళ్లు వెళ్లడం సాధ్యపడుతుంది. దీనివల్ల ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను వెయిటింగ్‌లో ఉంచకుండానే.. వందేభారత్ లాంటి సెమీహైస్పీడ్ రైళ్లు దూసుకెళ్తాయి. భవిష్యత్తులో ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల వేగం గంటకు 200 కి.మీ. వేగాన్ని అందుకోనుంది. క్వాడ్రాపుల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వస్తే సరకు రవాణా కూడా వేగవంతం అవుతుంది

Tags:    

Similar News