Anjani Kumar: 'రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లాను': అంజనీ కుమార్‌

Byline :  Veerendra Prasad
Update: 2023-12-12 04:55 GMT

తెలంగాణకు చెందిన ఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్‌ పై విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే.. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి డీజీపీ హోదాలో అంజనీ కుమార్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఎన్నికల సంఘం డీజీపీపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ డీజీపీపై వేటు వేసింది. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చుకున్న ఆయన.. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్‌రెడ్డి పిలిస్తేనే వెళ్లానని.. మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్‌ హామీ ఇచ్చారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది.

అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేటయంతో.. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. ఆనాడు అంజనీకుమార్ ను సస్పెండ్ చేసిన వెంటనే.. తెలంగాణ డీజీపీగా రవి గుప్తాను నియమించింది సీఈసీ . ప్రస్తుతం డీజీపీగా ఆయనే కొనసాగుతున్నారు. ఇప్పుడు అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేటయంతో ఆయన్ను మళ్లీ డీజీపీగా నియమిస్తారా? ఏ పోస్టు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News