KCR : కేసీఆర్ ప్రచార వాహనాన్నితనిఖీ చేసిన బలగాలు

Byline :  Kiran
Update: 2023-11-20 06:07 GMT

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల సంఘం మరింత అప్రమత్తమైంది. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచార వాహనాన్ని కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీ చేశాయి.

సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీ నిర్వహించాయి. ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈ రోజు కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో సభా ప్రాంగణానికి ప్రగతి రథం బస్సు వెళ్తున్న సమయంలో గుండ్లపల్లి టోల్‌గేట్‌ వద్ద కేంద్ర బలగాలు వాహనాన్ని ఆపాయి. అనంతరం బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇవాళ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారు. మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరవుతారు.




Tags:    

Similar News