National Turmeric Board: పసుపు బోర్డు గెజిట్ నోటిఫికేషన్ లో కేంద్రం మరో ట్విస్ట్ !
పసుపు బోర్డు... నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల డిమాండ్. పసుపు బోర్డు కావాలని ఎన్నో సంవత్సరాలుగా నిజామాబాద్ పసుపు రైతులు ధర్నాలు మరియు రాస్తారోకోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మొన్న తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ... పసుపు బోర్డు పై కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ రైతుల కోసం పసుపు బోర్డు ప్రకటిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత కేబినెట్ మీటింగ్ లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
అయితే తాజాగా...పసుపు బోర్డు ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర రైతుల్లో ఆనందం నింపాల్సింది పోయి.. అనుమానాలను రేకెత్తించింది. ఎందుకంటే ఈ గెజిట్ నోటిఫికేషన్లో తెలంగాణ పేరు కనిపించలేదు. పసుపు బోర్డు మండలి కూర్పు, దాని ఉద్దేశాలు, ఆర్థిక వనరులకు సంబంధించిన విధివిధానాలు, దాని నిర్వహణ, పర్యవేక్షణ వంటివన్నీ పేర్కొన్నారు. కానీ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది.. దానికేమైనా ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయా.. అన్న వివరాలేవీ పేర్కొనలేదు. ఇందులో ఎక్కడా తెలంగాణ రాష్ట్రం పేరు లేదు. నోటిఫికేషన్లో పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం అంటూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో భూతద్దంతో వెతికినా తెలంగాణ పేరు కనిపించలేదు. దీంతో నిజామాబాద్ జిల్లా రైతులకు మళ్ళీ నిరాశే మిగిలిందని అంటున్నారు. నిజామాబాద్ జిల్లా రైతులతో కేంద్రం గేమ్స్ అడుతుందని ఫైర్ అవుతున్నారు.
కేంద్ర విడుదల చేసిన ఈ గెజిట్ నోటిఫికేషన్ తో రాష్ట్ర రైతులకు మరోసారి నిరాశే మిగిలిందని.. మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని బీజేపీ చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. పసుపు బోర్డుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మరో ఎన్నికల జుమ్లా అని తెలిసిపోయిందంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించింది. తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుదామంటూ తన పోస్టులో పేర్కొంది.
ఇప్పటికే హైదరాబాద్ లో జాతీయ ఔషధ విద్య, పరిశోధన మండలి (నైపర్) శాఖ ఉన్న విషయం తెలిసిందే.. దానికి బదులు గువహటిలోని నైపర్ డైరెక్టర్ ను పసుపు బోర్డులో సభ్యుడిగా నియమించారు. ఈ మండలి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణలో ఉంటుందని తెలిపారు. పసుపు బోర్డుకు నిధులు కూడా కేంద్ర సర్కారే సమకూరుస్తుంది. ఈ మండలి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణలో సాగుతుంది.
పసుపు బోర్డు విషయంలో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న బీజేపీ
— BRS Party (@BRSparty) October 6, 2023
కేంద్ర వాణిజ్యశాఖ గురువారం పసుపు బోర్డు ఏర్పాటుపై జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఒక్క చోటా కనిపించని "తెలంగాణ" పదం
పసుపు బోర్డుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన మరో ఎన్నికల జుమ్లా అని… pic.twitter.com/6cbRehiUpi