ఇద్దరు తెలంగాణ ఆఫీసర్లకు IAS హోదా.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
Byline : Bharath
Update: 2024-01-16 05:38 GMT
ఇద్దరు తెలంగాణ అధికారులను ఐఏఎస్ అధికారులుగా నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ రెవెన్యూ కోటాలో.. కమర్షియల్ ట్యాక్స్ (Commercial Taxes) అధికారులు కే.సీతాలక్ష్మీ, జి.ఫణీందర్ రెడ్డిలను ఐఏఎస్ లుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఐఏఎస్ అధికారులు ఒమర్ జలీల్, అర్విందర్ సింగ్ లు రిటైర్మెంట్ తీసుకోవడంతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. కాగా ఈ రెండు పోస్టులకోసం ఒక్కో పోస్ట్ కు ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది ఇంటర్వ్యూకు అటెండ్ కాగా.. వాళ్లో కే.సీతాలక్ష్మీ, జి.ఫణీందర్ రెడ్డిలు సెలక్ట్ అయ్యారు.