నాగార్జున సాగర్ వివాదంపై కేంద్ర హోంశాఖ సమీక్ష

By :  Krishna
Update: 2023-12-01 15:24 GMT

నాగార్జునసాగర్‌ వివాదంపై కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు అజయ్ భల్లా కీలక సూచనలు చేశారు. నవంబర్ 28కి ముందు ఉన్న స్థితినే కొనసాగించాలని చెప్పారు. డ్యామ్ నిర్వహణ కేఆర్ఎంబీ చూసుకుంటుందని తెలిపారు. ఇకపై డ్యామ్ సీఆర్పీఎఫ్ పర్యవేక్షణలో ఉంటుందన్నారు. కేంద్రం ప్రతిపాదనలను తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.

కాగా అంతకుముందు సాగర్ కుడికాల్వ నుంచి నీరు తీసుకోవడం వెంటనే ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి కేఆర్‌ఎంబీ కార్యదర్శి లేఖ రాశారు. ఏపీకి 3 విడతల్లో నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. అక్టోబర్‌ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు చెప్పింది. 2024 జనవరి, ఏప్రిల్‌లో నీరు విడుదల చేయాల్సి ఉందని తెలిపిన బోర్డు.. ముందు అడగకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది.


Tags:    

Similar News