కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయి: ప్రధాని మోదీ

Update: 2023-07-08 07:59 GMT

వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కేసీఆర్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఇలా కుంటుంబ పాలనలో కూరుకుపోతుందని తాను ఏనాడు అనుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతిని పెంచిపోషిస్తోందని, కోట్లాది రూపాయలను కొల్లగొడుతోందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి ప్రజలకు తెలియడంతో.. వాళ్ల దృష్టిని మళ్లించేందుకు కొత్త వ్యూహాలు రచిస్తోందని విమర్శించారు. కేసీఆర్ వ్యూహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్ కుంటుంబ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని, త్వరలోనే వాళ్ల పని పడుతుందని వెల్లడించారు.

‘రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నాలుగు పనులు మాత్రమే చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నన్ను తిట్టడం, కుటుంబం.. పార్టీని పోషించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం, తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేయడం. ఇక్కడ అవినీతి ఆరోపణలు లేని ఒక్క ప్రాజెక్టూ లేద’ని కేసీఆర్ సర్కార్ పై మోదీ విరుచుకుపడ్డారు. రాణి రుద్రమను స్పూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలన అంతు చూడాలని కోరారు.




Tags:    

Similar News