చార్మినార్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేఘారాణి అగర్వాల్ పోలీసులను ఆశ్రయించారు. తన శత్రువులు తనకు చేతబడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మేఘారాణి శుక్రవారం నామినేషన్ వేయడానికి కారులో వెళ్లగా దారిలో వేలకొద్దీ ఇనుప మేకులు కనిపించాయి. తన కారుకు పంక్చర్ చేసి అడ్డుకోవడానికే శత్రువులు వాటిలో దారిలో పడేశారని మేఘారాణి ఆరోపించారు. చేతబడిలో భాగంగానే మేకులు చల్లారని, తనను ఎదుర్కొనే విధానం ఇది కాదని చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తను బెదిరే ప్రసక్తే లేదని, విజయం తమ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.