Breaking News : సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

Byline :  Vamshi
Update: 2024-03-05 10:23 GMT

(BRS MLA Kale Yadaiah) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య సీఎంను కలిశారు. అయితే ఆయనను ఎందుకు కలిశారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. బీఆర్ఎస్ శాసనసభ్యులు సీఎంను కలవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందులోనూ ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిసిన సంగతి తెలిసిందే. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి మాణిక్ రావు కలిశారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రారావు భేటి అయ్యారు..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు బీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని స్వయంగా కలుస్తున్నారు. కొందరు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు తమ నియోజకవర్గాల పరిధిలోని సమస్యలపై చర్చించేందుకే సీఎంను కలిశామని చెబుతున్నారు.




 





Tags:    

Similar News