రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

Update: 2023-10-23 01:58 GMT

దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉన్నదని అన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయ దశమి పేరుతో దేశ వ్యాప్తంగా జరుపు కుంటారని తెలిపారు. దసరానాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి సామూహికంగా సంబురాలు జరుపు కోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్‌ బలాయ్‌ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని విజయదశమి పండుగకు ఉన్న విశిష్టతను ప్రత్యేకతను మరొకసారి ప్రజలతో పంచుకున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, అగ్రపథాన కొనసాగించేందుకు విజయ దశమి స్ఫూర్తితో అలుపెరుగని పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు నిత్య విజయాలు కలిగేలా దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరి పై ఉండాలని, ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని సీఎం కేసీఆర్‌ దుర్గామాతను ప్రార్థించారు.


Tags:    

Similar News