సెక్యూరిటీ కేసులో చికోటి ప్రవీణ్‌కు షాక్..

Update: 2023-07-17 13:41 GMT

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు పోలీసులు షాకిచ్చారు. తన సెక్యూరిటీ కేసులో చికోటి ప్రవీణ్ కుమార్‌ను ఏ - 1 గా ఛత్రినాక పోలీసులు చేర్చారు. ఏ2గా సుందర్ నాయక్, ఏ 3 గా రమేష్ గౌడ్, ఏ 4 గా రాకేష్‌ లను చేర్చి ముగ్గురు సెక్యూరిటీని రిమాండ్‌కు తరలించారు.

బోనాల సందర్భంగా లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకునే సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీతో చికోటి ప్రవీణ్ హల్చల్ చేశారు. వెపన్స్ తో బోనాల జాతరకు చికోటి సెక్యూరిటీ వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‎కు తరలించారు. అతని గార్డుల తుపాకీ లైసెన్సులు ఫోర్జరీ లైసెన్సులని తేల్చి కేసు నమోదు చేశారు. అనంతరం చికోటి సెక్యూరిటీని రిమాండ్‎కు తరలించారు.

రెండు నెలల క్రితం చికోటి ప్రవీణ్‌ను థాయ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. పటాయలోని ఓ హోటల్ లో భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా చికోటితో పాటు 90 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. గతంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో క్యాసినో నిర్వహిస్తూ ప్రవీణ్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఇతనిపై మనీలాండరింగ్‌ అభియోగాలు కూడా ఉన్నాయి. ఈడీ కేసులను సైతం ఎదుర్కొంటున్నారు. తరచూ ఏదో ఒక వివాదం చికోటిని వెంటాడుతూనే ఉంది.


Tags:    

Similar News