పోలీసుల అదుపులో చీకోటి ప్రవీణ్ సెక్యూరిటీ.. తుపాకీ గుర్తింపు
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన సెక్యూరిటీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోనాల సందర్భంగా లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకునేందుకు నేడు చికోటి రాగా..ఆయన సిబ్బంది గన్‌తో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. గమనించిన పోలీసులు చికోటి సెక్యూరిటీని అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గన్ లైసెన్స్‌లపై ఆరా తీస్తున్నారు.
రెండు నెలల క్రితం చికోటి ప్రవీణ్‌ను థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పటాయలోని ఓ హోటల్ లో భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా చికోటితో పాటు 90 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. గతంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో క్యాసినో నిర్వహిస్తూ ప్రవీణ్ అరెస్ట్ అయ్యాడు. ఇతనిపై మనీలాండరింగ్ అభియోగాలు కూడా ఉన్నాయి. ఈడీ కేసులను సైతం ఎదుర్కొంటున్నారు. తరచూ ఏదో ఒక వివాదం చికోటిని వెంటాడుతూనే ఉంది.