కేసీఆర్‌తో మాట్లాడాలె.. బస్సుల్లో వచ్చిన 540 మంది చింతమడకోళ్లు

Byline :  Lenin
Update: 2023-12-06 10:29 GMT

అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రగతి భవన్ నుంచి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌కు వెళ్లిన కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ కోసం పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించారు. ఆయనను కలవడానికి పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క కేసీఆర్ స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడక నుంచి వందలాది ప్రజలు ఆయనను కలుసుకోవడానికి ఎర్రవెల్లి చేరుకున్నారు. 500 మందికిపైగా ప్రజలు 9 బస్సుల్లో ఫామ్ హౌస్‌కు వెళ్తుండగా చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపేశారు. కేసీఆర్ అనుమతితోనే వచ్చామని చింతమడక వాసులు చెప్పారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎలాగైనా కేసీఆర్‌ను కలిసే వెళ్తామంటూ రోడ్డుపైనే నిల్చుని ఎదురు చూస్తున్నారు. 

Tags:    

Similar News